Categories
పని ప్రదేశాలలో ప్రతి సంవత్సరం మన దేశంలో 400కు పైగా లైంగిక వేధింపుల కేసులు నమోదు అవుతున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక తెలియజేసింది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో నివేదిక ప్రకారం సగటున 445 కేసులు నెలకు 35 చొప్పున లైంగిక వేధింపులు కేసులు నమోదు అవుతున్నాయి. వీటిలో హిమాచల్ ప్రదేశ్ లో అత్యధికంగా 97 కేసులు నమోదైతే, కేరళలో 83, మహారాష్ట్ర 46, కర్ణాటక లో 43 కేసులు నమోదయ్యాయి. 2022-23 లో 1160 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. గత దశాబ్ది లో ఇది పెద్ద సంఖ్య కానీ ఇవి 300 కంపెనీల నుంచి అందిన గణాంకాలు మాత్రమే. దేశంలో ఎన్నున్నాయో లెక్కలు లేవు.