Categories
చక్కెర స్థాయిని పెంచే పండ్లు రసాలు కాకుండా ఆకుపచ్చని రసాలతో ప్రయోజనం ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బ్రకోలీ, గోధుమ గడ్డి రసాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఫైటో న్యూట్రీషన్లు, క్లోరోఫిల్, కెరోటినాయిడ్స్ వీటితో ఎక్కువ జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. కానీ, గ్రీన్ ఆపిల్, జామా, ద్రాక్ష వంటివి కూడా ఈ తరహా పచ్చ రసాల్లోకే వస్తాయి. ఈ వర్గం పండ్లలో ఉండే కెరోటినాయిడ్లు, విటమిన్లు శరీరాన్ని శక్తిమంతం చేస్తాయి. వీలైనంతగా చక్కెర కలపకుండా ఈ రసాలను తీసుకుంటే మహిళల్లో కనిపించే నీరసం బలహీనత తగ్గుతాయి.