Categories
గోద్రెజ్ వ్యాపార సామ్రాజ్యం లో మూడో తరం లో పుట్టారు స్మిత గోద్రెజ్. ముంబై లో పుట్టిన స్మిత, ‘లా’ లో డిగ్రీ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేశారు. గోద్రెజ్ ను విద్యా, ఆరోగ్య రంగాల్లో దూసుకుపోయేలా చేసి టాప్ విమెన్ బిజినెస్ లీడర్స్ లో ఒకరుగా నిలిచారు. దేశం లోని మహిళా బిలినీయర్స్ లో స్మిత ఒకరు. 3. 3 బిలియన్ల ఆస్తులు ఆమె ఫోర్బ్స్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా సభ్యురాలు. 73 సంవత్సరాల స్మిత గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి,వారిని వ్యాపార దిశగా ప్రోత్సాహించడం చేస్తున్నారు.