యశోద,రియా కారుటూరి వూహూ ఫ్రెష్ పేరుతో పువ్వులను అమ్మే ఆన్ లైన్ రిటైల్ బ్రాండ్ మొదలుపెట్టారు. వూహూ అంటే కన్నడలో పువ్వు. బెంగళూరులో పుట్టిన ఈ అక్కా చెల్లెలు విద్యార్థులు. వూహూ ఫ్రెష్ లో చందాదారులుగా చేరితే పండుగలకు ఇతర శుభకార్యాలకు పువ్వులు ఇంటికే అందిస్తారు. పూజ కోసం జీరో టచ్ ప్యాకింగ్ కూడా ఉంటుంది. స్విగ్గి, జొమాటో, అమెజాన్ ద్వారా పూల హారాలు పత్రి కలిపిన దళాలు ప్రత్యేకమైన బాక్స్ లో పెట్టి అమ్ముతారు. ప్రస్తుతం 300 ఆలయాల్లో వీళ్లు పంపిన పూల తోనే పూజలు చేస్తున్నారు.వీరి బ్రాండ్ విలువ 50 కోట్లు.

Leave a comment