Categories
పూణేలోని మోడరన్ కాలేజ్ నిర్వహించిన బయోటెక్నాలజీ పరిశోధనలో కనకాంబరాలు సెల్ ఫోన్ పై పేరుకొనే బ్యాక్టీరియాను తొలగిస్తాయని తేలింది. ఈ కనకాంబరాల్లో ఔషధ గుణాలు ఎక్కువ. కేశలంకరణకు దేవుడి పటాలకు ఇతర అలంకరణ లో వాడే ఈ పూలను ఫోన్ పై పేరుకొనే బ్యాక్టీరియా పోగొట్టేందుకు వాడుకోవచ్చు వాసన ఉండదు కానీ కంటికి ఇంపైన రంగులతో కనిపించే ఈ కనకాంబరాలు చెట్టు నుంచి కోశాక కూడా నాలుగైదు రోజులు తాజాగానే ఉంటాయి. నారింజ, పసుపు రంగుల్లో కనిపించే ఈ మొక్క ఇంట్లో కుండీల్లో పెంచుకోవచ్చు.