నటి ఆలియా భట్ 180 ఫ్యాబ్రిక్ ప్యాచ్ లతో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన తన పెళ్లి డ్రెస్ ను మళ్లీ దీపావళి వేడుక కోసం ధరించి కొన్ని ఫ్యాషన్ లు మారిపోవని చెబుతోంది.ఈ డ్రెస్ కోసం 180 క్లాత్ ప్యాచ్ లను కలిపి కుట్టరు. జాకెట్ కోసం అచ్చమైన బంగారం, వెండి,నక్షి, కోరా పువ్వులు పాతకాలపు గోల్డ్ మెటల్ సీక్వెన్స్ లతో అలంకరించారు. ఈ ప్యాచ్ వర్క్ చాలా ప్రాచీన సాంప్రదాయానికి చెందింది. ప్రాచీన ఈజిప్ట్ చైనా వంటి దేశాల్లో గృహాలంకరణ కోసం అందమైన బెడ్ షీట్స్ గా రూపొందించేవారు.రకరకాల పట్టు వస్త్రాల ముక్కలతో తయారు చేసే బొంతలు కూడా చైనా సాంప్రదాయ కళే.

Leave a comment