కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఎన్నో జాగ్రత్తలు,సందేశాలు భయాలు హెచ్చరికలు సోషల్ మీడియాలో సంచారాలు చేస్తున్నాయి. వాటిలో ఒకటి ఐస్ క్రీమ్ తింటే కరోనా వస్తుందనీ సందేశం…. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సూచన లో ఏమాత్రం అర్ధం లేదని కొట్టిపడేసింది ఐస్ క్రీమ్,లేదా చల్లని పదార్ధాల వల్ల కరోనా సోకుతుందనే అపోహలు అవాస్తవమని అలాటివి నమ్మ వద్దండి. అయితే దేన్నయినా మితంగా,ఆరోగ్యానికి భంగం కలిగించని పరిమాణంలో తీసుకోవాలని చెపుతోంది. కరోనా సమయమనే కాదు,ఏ సందర్భం లోను ఐస్ క్రీమ్,ఇతర పానీయాలు వాటిలో వుండే స్వీటెనర్ల వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు ఏమీ లేదు కనుక వాటిని విరివిగా తినమని సిఫార్స్ చేయలేమని చెపుతోంది.

Leave a comment