Categories
కలకత్తా లో జన్మించిన వేదిక ఖేమానీ అమెరికాలోని హార్వీ మడ్ కాలేజీలో భౌతిక శాస్త్రం చదివారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ నాన్ ఈక్విలిబ్రియం క్వాంటమ్ లో చేసిన రీసెర్చ్ టైమ్ క్రిస్టల్స్ గుర్తించటంలో చూపించిన ప్రతిభ తో ఆమెకు ఇన్ఫోసిస్ అవార్డు లభించింది. వేదిక ఖేమానీ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆమె పరిశోధనలు క్వాంటమ్ ఫిజిక్స్ లో కీలకం, మరెన్నో ఆధునిక సాంకేతిక పరిశోధనలకు మార్గం చూపించాయి.భౌతిక శాస్త్ర పరిశోధనలోకి మహిళలు ఎక్కువగా వస్తే సరికొత్త మార్గాల్లో ప్రయాణం చేయగలం అంటారు వేదిక.