Categories

24 సంవత్సరాల ప్రియాంక ఇంగ్లే మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ గెలిచిన జట్టు సారధి గా దేశంలో గుర్తింపు పొందింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ప్రియాంక ఐదో తరగతి లోనే ఖోఖో ఆడటం మొదలు పెట్టింది.ఖోఖో నే తన ప్రపంచంలో సాగిపోతున్న ప్రియాంక ఎన్నో అపురూప విజయాలు సాధించింది రెండేళ్ల కిందట మహారాష్ట్ర ప్రభుత్వం రాణి లక్ష్మీబాయి అవార్డుతో పాటు శివ చత్రపతి స్టేట్ స్పోర్ట్స్ అవార్డ్ ఇచ్చి సత్కరించింది. అంతకుముందు సచ్ జూనియర్ జాతీయ ఖోఖో టోర్నీలో కనబరిచిన ప్రతిభకు ఉత్తమ క్రీడాకారిణి అవార్డ్ అందుకున్నది తాజాగా ప్రపంచ కప్ గెలిచాక మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె జట్టుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.