ఓపిక ఉన్నప్పుడు కాస్త డబ్బులు సంపాదించుకొని దాచుకున్నట్లు ఓ నాలుగు గంటలు సమయాన్ని కూడా భవిష్యత్తు కోసం దాచుకోవచ్చు అంటుంది టైమ్ ని కూడా భవిష్యత్తు కోసం దాచుకోవచ్చు అంటుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా (TBI) రకరకాల కారణాల వల్ల ఒంటరిగా ఉండే వృద్ధులు తమకు కాస్త పనులు చేసే వాళ్ళ కోసం చూస్తుంటారు. ఆస్పత్రికి తీసుకుపోయే వాళ్లు, ఇతర సాయం చేసేవాళ్లు చాలా అవసరం అలాంటి ఆప్తులను వెతికి తెస్తుంది రాజస్థాన్ లోని టి బి ఐ సంస్థ. ఇప్పుడు వాలంటీర్లు గా చేరిన వాళ్ళు ఎన్ని గంటలు పనులు చేశారో రికార్డ్ చేసి బ్యాంక్ లో నమోదు చేస్తుంది. ఇలా సాయం చేసిన వాళ్లు వయసు పై బడ్డాక ఆ సమయాన్ని వాడుకోవచ్చు ఈ సంస్థ కు మద్దతు ఇస్తున్న రాజస్థాన్ ప్రభుత్వం ‘ఆనందం’ అనే అంశాన్ని కాలేజీ విద్యార్థుల సిలబస్ లో భాగంగా చేసింది. హైదరాబాద్ లో కూడా ఈ సంస్థ బ్రాంచ్ లున్నాయి.

Leave a comment