ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ కు చెందిన ప్రతిపాల్ పుట్టుకతోనే సెలబ్రిల్ పాలీస్. కాళ్లు బలహీనంగా వంకరగా ఉన్నాయి. కుటుంబం ఆమెకు చికిత్స చేయించారు  ఐదో ఏటనే కాలిపర్స్ పెట్టారు పెరిగి పెద్దయ్యాక పారా స్పోర్ట్స్ లోకి అడుగు పెట్టింది ప్రీతి. పరుగులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది పారా ఒలింపిక్స్ లక్ష్యంగా గత సంవత్సరం పరుగులో రెండు కాంస్య పతకాలు సాధించింది.  ఈ క్రీడలో రెండు పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్ గా రికార్డ్ నమోదు చేసింది తాజాగా అర్జున్ అవార్డు అందుకుంది 24 సంవత్సరాల ప్రీతి అలాగే ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలోకి ఎక్కింది.

Leave a comment