అత్యంత ఖరీదైన ఉత్పత్తులను వాడుతున్న వయసులో వచ్చే మార్పులు మొహంపోయిన కనబడుతూనే ఉన్నాయే నని ఎంతో మంది సందేహం. ఎన్నో రకాల క్రీములు అనవసరపు ప్రయోగాల వల్లనే ముఖచర్మం దెబ్బతింటుందని వైద్యులు చెపుతున్నారు. పరిశుభ్రమైన నీళ్లతో కడుక్కోవటం కంటే సౌందర్య చిట్కా మరొకటిలేదని వాళ్ళ వాదన. ఇప్పుడు మార్కెట్ లో దొరికే యాంటీ ఏజింగ్ ఉత్పత్తులో హైల్యూజనిక్ యాసిడ్ షియా బటర్స్ ,గ్లిజరిన్ వుంటే అవి మాయిశ్చరైజర్ గా కుడా పనిచేస్తాయి. లేకపోతే సహజమైన తేమ కుడా ఈ ఏజింగ్ క్రీములు కడిగేయగానే పోతుంది. యాంటీ ఏజింగ్ క్రీములో ఆల్మండ్ ఆయిల్ .వీట్ జెర్మ్ ఆయిల్ వుందో లేదో చూసుకోవాలి. లేదా ఆ క్రీములో ఏ ఏ పదార్ధాలు వుంటాయో తెలుసుకోలేం కనుక చర్మం మడతలు పడదు. ముఖ సౌందర్యాన్ని పెంచేది సహజమైన నిద్ర. కంటినిండా నిద్ర వేలకు తిండి మించిన ఆరోగ్య సూత్రం లేదు. రాత్రివేళ ముఖం శుభ్రంగా కడుక్కుని రెట్ నాల్ కలిగిన నైట్ క్రీమ్ ని రాసుకుంటే చాలు. చందనపు పేస్ట్ దగ్గర నుంచి పసుపు తేనె నిమ్మ పాలు సెనగపిండి దాకా సహజమైన పదార్ధాలను వాడి చూడండి. యాంటీ ఏజింగ్ క్రీమ్ పక్కన పడేస్తారు.
Categories