సినిమా ప్రపంచం ఒక మహేంద్రజాలం. నటన వచ్చి డాన్స్ లొచ్చి ,పంచ్ డైలాగ్స్ పండించేస్తే యాక్టర్స్ అయిపోరు. స్టార్ మెటీరియల్ ను గుర్తు పట్టే కాస్టింగ్ డైరెక్టర్స్ షానూ శర్మ లాంటి వాళ్ళ కళ్ళలో పడాలి. పబ్స్ , మాల్స్ , కాలేజీ ఫంక్షన్స్ కాఫీ షాప్స్ కుర్రకారును అన్వేషించే షానూ శర్మ శబాష్ అనుకుంటే చాలు వెండితెర వేల్పులైపోతారు. రణబీర్ సింగ్ దగ్గర నుంచి ఆలియా భట్ , పరిణీతి చోప్రా ,వాణీ కపూర్ ,భూమిక ఇలా చాలా పెద్ద లిస్టే వుంది. ఆమె రికమెండ్ చేసిన వాళ్లలో వున్నారు. కాస్టింగ్ డైరెక్టర్ గా సినిమాకు కావలిసిన నటీనటులను ఎంపిక చేస్తారు. ఫేస్ బుక్ ,ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వంటి సామజిక మాధ్యమాలు ఫొటోలో షానూ శర్మ కార్యాలయంలో ఆమె అసిస్టెంట్స్ వడపోసి ఆమె ముందు పెడతారు. ఆడిషన్స్ నిర్వహించి కొందరిని సెలెక్ట్ చేసి వాళ్ళని దర్శకులకు రికమెండ్ చేస్తుందామె. దర్శకులు చెప్పే కధ పాత్రల తీరుతెన్నులు అర్ధం చేసుకుని ఆ ఊహలను ఆధారంగా నటుల్ని సెలెక్ట్ చేయటం ఆమె వృత్తి. తెరముందు తారలు మనకు తెలుసు. తెర వెనుక ఒక మహా సముద్రం వుంది. సెట్ లో బాయ్ దగ్గర నుంచి కెమెరాలు, లైట్లు , కాస్ట్యూమ్స్ , సెట్లు , ఆ సెట్టు సరిగ్గా నిలబడేందుకు అందులో మేకులు ఎక్కడ దిగ్గొట్టాలో తెలిసిన అసిస్టెంట్ తో సహా సినిమా అనే అందమైన కధని మన ముందు సృష్టించేందుకు తలో చేయి వేస్తారు. మనం జూనియర్ ఎన్టీఆర్ మీసాలు మెలేస్తే రెచ్చిపోతాం. ఆ మీసాలు అంటించి అవి ఊడిపోకుండా జాగ్రత్తగా కాపాడే మేకప్ అసిస్టెంట్ మొహం మీరు చూడగలరా ?
Categories
Nemalika

స్టార్ మెటీరియల్ ను గుర్తుపట్టే షానూ శర్మ

Leave a comment