క్వీన్ ఆఫ్ పాప్ గా పిలిచే మడోన్నా సంగీత రంగంలో సంచలనం ఈవిడ పాటల రికార్డ్స్ 300 మిలియన్లు అమ్ముడుపోయాయి. అత్యంత ప్రతిభావంతమైన మడోనా సంగీతకోవిదురాలు మహిళా వ్యాపారవేత్త ప్రజలకు ఆదర్శం కూడా. నిరంతరం నూతన కల్పనలు ఆమె విజయ రహస్యం. మోడల్తో మొదలైన హెయిర్ స్టైల్ తో వైల్డ్ గా  కనిపించే మడోనా రాను రానూ ఫ్యాషన్ ఐకాన్ గా  మారిపోయింది. కాటుక కళ్ళు ఫిట్ నెస్ గా వుండే శరీరం కాప్రీ లు డెనిమ్ లతో ఆమె యువత కు ఆరాధ్య దేవతగా మారిపోయింది. తన దైన అసాధారణ మార్గంతో ఫ్యాషన్ పరిశ్రమనే శాసించగలదీమె. సంగీత ప్రపంచాన్ని ఎలా మార్చగలిగిందో  ఫ్యాషన్ ను కూడా ఇంతే. ఈ వెడ్డింగ్ గౌన్ దగ్గర నుంచి డెనిమ్ టీ షర్ట్ దాకా ఆమె ఏం ధరించినా ఫ్యాషన్. బ్రిట్నీ స్పియర్స్ ఈమె  ద్వారానే స్ఫూర్తి పొందనంటోంది. మడోన్నా  ను ప్రత్యేకంగా ఎందుకు పరిచయం చేసుకుంటున్నామంటే ఈ ఆధునిక వ్యాపారప్రపంచాన్ని సరైన అంచనా తో అందుకోగలిగే  వ్యక్తులను గుర్తుచేసుకుంటే మనం వెళ్లే దరి స్పష్టంగా కనిపిస్తోస్తుందని. అంతేగానీ మడోన్నా ఎలా జీవించిందా  జెస్సికా ఎలా బతికిందా  వాళ్ళ పర్సనల్ జీవితాలు ఎవరిదైనా అనవసరం. ప్రపంచంలో టాప్ స్టార్ గా  నిలబడాలంటే వాళ్ళు చేసిన కృషి మాత్రం తెలుసుకోవాలి. అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమన్ గా  ఫోర్బ్స్ మ్యాగజైన్  ఆమెను ఒక ర్యాంక్  లో  నిలబెట్టింది.

Leave a comment