Categories
సెల్ ఫోన్ తో సెల్ఫీస్ తీసుకోవడం ఇప్పటి ట్రెండ్ కదా. అప్పుడు మనం మనకి మనమే అందంగా ఫోటోలు దిగడం కష్టమే. ఈ బాధ లేకుండా సెల్ఫీ ఎన్ హాన్సింగ్ లైవ్ ఫీడ్ ఇమేజ్ ఇంజిన్ (సెల్ఫీ అన్నమాట) అనిపించే ఒక అద్దం వచ్చేసింది. ఈ అద్దం ముందు నిలబడి ఓ నవ్వు నవ్వితే అద్దమే ఫోటో తీసి దాన్ని ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తుంది. ఈ అద్దానికి కెమేరా తో పాటు మన ముఖాన్ని గుర్తించే సెన్సార్లు కూడా వుంటాయి కాబట్టి మనం అద్దం ముందు నిలబడి నవ్వగానే దాని పైన వుండే ఎల్ ఇ డి లైట్లు ఫోటో తీయడానికి సిద్ధంగా వునట్లు వెలుగుతాయి. మనకు కావాల్సిన ఫోజు పెడితే అద్దం ఫోటో తీసి ట్విట్టర్ అకౌంట్ కి అప్లోడ్ చేసేస్తుంది. ఈ మయాదర్పణాన్ని కావాలంటే ఆర్డర్ చేసి కొనుక్కో వచ్చు.