కరోనా సమయం.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తక్కువే ప్రతి రోజు ఆఫీస్ కి వెళ్లక తప్పదు.ఆఫీస్ నుంచి తెచ్చిన హ్యాండ్ బ్యాగ్ ను అలాగే ఆఫీస్ కు తీసుకు వెళ్ళద్దు , అసలు హ్యాండ్ బ్యాగ్స్ ఎన్నో వేల రకాల బ్యాక్టీరియా మన ఇంటి వరకు మోసుకొస్తూ ఉంటాయి.బ్యాక్టీరియా వైఫ్స్ మార్కెట్లో దొరుకుతాయి వాటిని దగ్గర పెట్టుకోవాలి వాటితో ఫోన్, ఇయర్ ఫోన్స్, తాళాలు వీటన్నింటిని ఒక్కసారి తుడిచి హ్యాండ్ బ్యాగ్ లోపల వైపున శానిటైజర్ వేసిన బట్టతో తుడిచి తిరిగి వస్తువులను లోపల  పెట్టుకోవాలి.లెదర్ బ్యాగ్ అయితే తప్పనిసరిగా శానిటైజర్ తో తుడవాలి.గుడ్డ తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ ఉతికి ఎండలో వేయటం మంచిది.నీళ్ల సీసాని ప్రతి రోజు వేడి నీళ్లతో శుభ్రం చేసిన తర్వాతే వాడుకోవాలి.

Leave a comment