Categories
డిగ్రీ చదువుకుని పద్మజ ఉద్యోగం కోసం కొల్వాపూర్ నుంచి ధార్వాడ్ కు బయలుదేరి వచ్చింది. కార్లు అమ్మే షోరూమ్ లో ఉద్యోగం దొరికింది నెమ్మదిగా సర్విసింగ్, డ్రైవింగ్, కార్ మెకానిజం అన్ని నేర్చుకుంది. సొంతంగా కారు షెడ్ పెట్టుకుంది. పురుషులు చేసే పని నీకెందుకు అన్నారందరూ. కానీ పద్మజ మహిళలకు శిక్షణ ఇచ్చి వారినే పనిలో పెట్టుకుంది. ధార్వాడ్ లో ఈ కారు మెకానిక్ షెడ్ లో అందరూ మహిళలే పని చేస్తారు. పద్మజా పాటిల్ ధ్యేయం నెరవేరింది. చెక్కగా యునీఫాం వేసుకుని తన తోటి మహిళల తో కలిసి పని చేస్తుంది చెక్కని సేవలందిస్తుంది. వచ్చిన కారును సకలంలో బాగు చేసి ఇస్తుంటే ఇప్పుడు ఆమెకు గొప్ప పేరు కోట్ల రూపాయిల ఆదాయం వచ్చి పడ్డాయి.