కొన్ని నగలు ధరిస్తే అమ్మాయిలకు అందం వస్తుంది. కొన్ని నగలకు అమ్మాయిలు ధరిస్తేనే అందంగా కనిపిస్తుంది. తల తిప్పారనుకొండి ఆ వజ్రాల తో తళుక్కుమంటారు. పెదవులపైకి నవ్వొస్తే నీటి బిందువు లాంటి చెవిపోగులు పచ్చని ఆకుల చివర నెమ్మదిగా ఊగుతాయి. ఏ వర్ణపు దుస్తులయితే ఆ వర్ణాలతో మెరిసిపోయే ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అమ్మాయిల ఫ్యాషన్. ముఖ్యంగా దీపాల వెలుగులో ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అందం చూడాలి. గాఢమైన రంగుల దుస్తుల పైకి మరే నగలు లేకపాయినా ఈ వజ్రపు చెవి పోగులు మెరిపిస్తాయి. అమ్మాయిల కోసం ప్రత్యేకించి ఈ డిజైన్లు ఓసారి చూడండి.

Leave a comment