కొన్ని బుల్లి బుల్లి వస్తువులే వంటింట్లో ఎంతో ఉపయోగ పడతాయి వీటి గురించి తెలియక పొతే ఎలాగోలా అవస్థ పడతామనుకోండి. ఉదాహరణకు గార్లిక్ చెస్ట్ నట్ పీలర్ చేతి వేళ్ళకు ఉంగరంలా తోడుగుక్కుని అల్లం పై చర్మం పల్చగా లాగేయోచ్చు కత్తి లాగా ఉపయోగ పడుతుంది. చేతులు మండ కుండా అల్లం పొట్టు వచ్చేస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లి ఇంట్లో గ్రయిడ్ చేసుకోవాలంటే వెల్లుల్లి రెబ్బలు వలవడం పెద్ద చాకిరి. మ్యాజిక్ సిలికాన్ గార్లిక్ పీలర్ ఒక్క చిన్న పైపు ముక్క లాగా వుంటుంది. దీన్లో ఒక్కో రెబ్బ పడేసి అలా ఊపితే చాలు చాలు వెల్లుల్లి పై పొట్టు వుడి వచ్చేస్తుంది. ఇవి ఆన్ లైన్ లో తెప్పించుకోవచ్చు.

Leave a comment