నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు. నీరు శక్తిని పెంచుతుంది. అలసట దూరం చేస్తుంది. మెదడులో ఎక్కువ శాతం నీరే కనుక నీరు తాగితే ఆలోచన పెరుగుతుంది. బరువు తగ్గిస్తుంది. భోజనం ముందు నీరు తాగాలి. శరీరంలోని వ్యర్ధాలు బయటకి పంపుతుంది. చర్మపు రంగును మెరుగు పరుస్తుంది. అరుగుదల, జీర్ణ ప్రక్రియకు నీరే అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సహజసిద్దమైన తలనొప్పి నివారిణి. బెనుకులు రాకుండా ఆపుతుంది. మంచి మూడ్ లో ఉంచుతుంది. ఇన్ని మంచి లక్షణాలు వున్న నీటిని ప్రతి రోజు ఒకటి రెండు గ్లాసుల నీటిని తాగడం మొదలు పెట్టాలి. కావలసినంత నీరు వుంది. జీవనానికి నీరే మూలం. మన శరీర కండరాలలో 75 శాతం నీరే. పోషకాలను శరీరం అంతటికీ సరఫరా చేసే రక్తంలో 82 శాతం నీరే. నీటిని అపురుపంగా వినియోగించుకొండి.
Categories