రిపెల్లింగ్, క్లైమ్బింగ్, జంపింగ్, బోటింగ్, జుమ్మా రింగ్, బ్లైండ్ ఫాల్, పారా షూటింగ్ అన్నింటిలోనూ నిష్ణాతురాలు కాన్ని బాయి . ఈ సాహస వంతురాలు పుట్టింది కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్ గాంది గ్రామం కోలామ్ ఆదివాసీ కుటుంబంలో చిన్నమ్మాయి ఇంటర్ చదివింది తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు సహాయ కార్యదర్శి ప్రకృతి ఒడిలో పెరిగిన కాన్ని బాయి అడవితల్లి వాడిలోని ఆడుతూ పాడుతూ అన్ని విద్యలు నేర్చింది. 2020లో సెకండ్ వరల్డ్ వాటర్ రిపెల్లింగ్ వరల్డ్ కప్ పోటీల్లో ఒక బంగారు వెండి, ఒక కాంస్యం మొత్తం నాలుగు పతకాలు సాధించింది .