అత్తగారు తన కోడలికి కిడ్నీ దానం చేసి ఆమె ప్రాణాన్ని నిలబెట్టింది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా గాంధీ నగర్ లో ఉంటున్న గనీదేవి ఆమె కోడలు సోనికాని ఢిల్లీలోని ఆప్సత్రికి తీసుకెళ్ళింది. ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయని ఒక కిడ్నీ ఇస్తే ఆమె ప్రాణం కాపాడవచ్చని వైద్యులు చెప్పారు. కాని సోనికా తల్లి భన్వారాదేవి ఆమె తండ్రి ,అన్న తమ కిడ్నీలు ఇవ్వమన్నారు. అప్పుడు సోనికా అత్తగారు గనీదేవి తన కిడ్నీ ఇచ్చేందుకు సంతోషంగా ముందుకు వచ్చింది.ఢిల్లీలోని సోనికాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. అత్తగారు ,కోడలు ఇప్పుడు కోలుకుంటున్నారు. అత్త,కోడళ్ళ బంధం ఎంతో చక్కగా ఉందని చేప్పేందుకు ఇదే ఉదాహరణ.

Leave a comment