గాయని చిన్మయి తన పై జరిగిన లైంగిక వేధింపుల గురించి నోరు విప్పింది. టీన్స్ లో ఉన్నప్పుడు ఒక ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్ వల్ల తను బైక్ యాక్సిడెంట్ అయి పడిపోతే గాయాలతో పడి ఉన్న తన పై చుట్టు చేరిన వాళ్ళలో కొందరు ఎక్కడపడితే అక్కడ పట్టుకున్నారంది. అలాగే చిన్నప్పుడు సాంథామ్ కమ్యూనికేషన్ స్టూడియోలో వాళ్ళ అమ్మ రికార్డింగ్ పనిలో ఉంటే తాను నిద్రపోతున్న సమయంలో తన ప్రైవేట్ పార్ట్స్ ఎవరో పెద్ద మనిషి ముట్టుకుంటే తనకు మెలుకువ వచ్చిందని చెప్పింది. అలాగే తన 19వ ఏట కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తే తన ఆఫీస్ కు రమ్మని తన తల్లితో తాను అక్కడికి వెళ్ళగానే లోపలికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడాని తెలిపింది.ఈ మాటలు పైకి చెప్పినందుకు గాను తాను ఎన్నో వేదింపులు,బెదిరింపులు ఎదుర్కొన్నా అని ఇప్పటికి తనను కామెంట్లతో విసిగిస్తున్నారని చిన్మయి చెబుతుంది.

Leave a comment