లండన్ లోని ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళ శాస్త్రవేత్త గా డాక్టర్ గగన్ దీప్ కాంగ్ అరుదైన రికార్డ్ సాధించారు. తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో గ్యాస్ట్రో ఇంటస్టైనల్ విభాగం ప్రొఫెసర్ గా వైరాలజీ నిపుణురాలిగా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యం తో ఆమె చేసిన పరిశోధనలకు జాతీయంగా అంతర్జాతీయంగా విశిష్టమైన గుర్తింపు లభించింది. డైయేరియా, రోటా వైరస్ వ్యాధులను అరికట్టే దిశగా ఆమె చేసిన విశిష్టమైన కృషిని ఆమెను ఇండియన్ వ్యాక్సిన్ గ్రాండ్ మదర్ గా గుర్తింపు వచ్చింది. నోటి ద్వారా తీసుకునే పలు రకాల వ్యాక్సిన్ ల పని తీరును మెరుగుపరచడంలో సత్ఫలితాలను సాధించారు డాక్టర్ గగన్ దీప్ కాంగ్.

Leave a comment