ఫేషియల్ స్టీమర్ మాస్క్ ప్రొఫెషనల్ ఫేషియల్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు చక్కగా సహకరిస్తుంది. టెంపరేచర్ ను కంట్రోల్ చేస్తూ చర్మ రంధ్రాలు క్లీన్ చేస్తూ మాయిశ్చరైజర్ చేయటం, స్కిన్ టోన్ మెరుగుపరచటం తో పాటు మొటిమలు బ్లాక్ హెడ్స్ మచ్చలు తగ్గించటం వంటి  మల్టీ ఫంక్షన్స్ అందిస్తోంది. రెగ్యులర్ స్టీమర్ కంటే పది రెట్లు సమర్థవంతంగా పనిచేస్తుంది.ముఖానికి పెట్టుకునేందుకు వెనక వైపు బ్యాండ్ ఉంటుంది.ఈ గాడ్జెట్ ముందు పై భాగంలో మినీ వాటర్ ట్యాంక్ ఉంటుంది. దీనిలో నీరు నింపి మొహానికి పెట్టుకుని బటన్ ఆన్ చేస్తే చాలు పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజ్ చేసేందుకు మేకప్ కు ముందు మేకప్ తర్వాత మొహాన్ని కాంతివంతం చేస్తుంది. ఇది నానో అయానిక్ స్టీమర్ లాగా పనిచేస్తుంది టైమ్ టెంపరేచర్ సెట్ చేసుకుంటే ఫేషియల్స్ స్పా కూడా దానితో పొందవచ్చు.

Leave a comment