ఉబెర్ సీనియర్ డైరెక్టర్ హోదాలో ఇంజినీరింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు  కోమల్ మంగ్తాని. గుజరాత్ లోని సూరత్ లో కట్టుబట్టతో నడుచుకునే సాంప్రదాయ కుటుంబంలో పుట్టారు కోమల్. సూరత్ లోని ధరమ్ సిన్హ్ దేశాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. విప్రో లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కొంత కాలం పనిచేశారు తర్వాత అమెరికాలో బిరకిల్, వి ఎం.వేర్ వంటి సంస్థల్లో పనిచేశారు. ఆరేళ్ల కిందట క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబెర్ లో చేరారు.ఉబెర్ ఈట్స్,ఉబెర్ రైడ్స్ ఉబెర్ ఫ్రెట్,జంప్ బైక్స్ వంటి బిజినెస్ యాప్స్ రూపకల్పనలో కీలక పాత్రా పోషించరు. కోడింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టె మహిళలు,బాలికలకు స్ఫూర్తి కోమల్ మంగ్తాని.

Leave a comment