నీహారిక,

మనం చాలా సందర్భాల్లో నాకు కుదరదు,నేనురాను,నాకు ఇష్టం లేదు అనే మాటలు చెప్పలేక తరువాత చాలా ఇబ్బంది పడి పోతువుంటాం.పనిలో వుంటాం. షాపింగ్ కి వెళదం. గంటలో వచ్చేదం అంటారు.కుదరదు అని చెప్ప లేకపోతె మనం చేసే పని ఆగిపోతుంది.నువ్వు ఈ స్వీట్ తిను అని బలవంతం చేస్తూ వుంటే  షుగర్ నేను తినను అని చెప్పలేక పోతే తిని టాబ్లెట్ వేసుకువాలి.ఇవి చాలా సున్నితమైనవి .మన వ్యక్తిగత అవసరాలు   వదులు కొని,సొంత పనులు త్యగం చేసి ఎదుటివారి కి ప్రాధాన్యత ఇస్తూ పోతే ఆ తరవాత వారికి అబద్ధాలు చెప్పి తపించుకోవాలసి వుస్తుంది.ఇది మన పిరికి తనం మనకు నిజంగా కుదరక పోతే ఇతరులు అడిగిన వాటిని తిరస్కరించే హక్కు మనకి వుంది.  అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మంచిది అన్న సామెత ఉందనే ఉంది.  .ఏ విషయం అయిన నా నిబంధన ఇది చెప్పితు పోతే ఇతరులకు మనం కొంత కాలానికి అర్థమైపోతారు.ఆ తరువాత ఈ సమస్య పోతుంది.

Leave a comment