బంగారు కాంతి తో మెరిసిపోతూ వుంటుంది గుమ్మడి కాయ. ఎనెన్నో రకాల వంటకాలు చేసుకో గల ఈ గుమ్మడి కాయలో పోశకాలు మనవ దేహానికి ఎన్నో మినరల్స్ వున్నాయి. పులుసు కూర, హల్వా, ప్రపంచ వ్యాప్తంగా సూప్ ల తయారీ, ఫూడ్డింగ్స్, పాన్ కేక్స్, కురలు, జ్యూసెస్ ల్లో ఇవి వడేస్తున్నారు. దోస, కిర దోస, సార్ కర్జూర్ గుమ్మడి జాతికి చెందినవే. గుమ్మడి గింజలలో గుండె ఆరోగ్యాన్ని పెంచే మోనో అన్ సాట్యూరేటెడ్ ఫ్యాటి ఆసిడ్స్ పుష్కలంగా వున్నాయి. విటమిన్-ఎ బీటా కెరటినాయిడ్స్ లాంటి ఫ్లావనాయిడ్స్ వున్నాయి. వీటి వల్ల వాపులు నొప్పులు తగ్గుతాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బయటకు ఊడ్చి పారేసే ఈ ఫ్లావనాయిడ్స్ వయస్సు తో పాటు వచ్చే కంటి , జలుబులను రాకుండా ఆపుతాయి. చర్మం ముడతలు పదనియదు. కండరాల్ల బలం కోసం, అలసి పొతే శక్తి సమకూర్చేందుకు, మెదడు పని తీరు మెరుగు పరచేందుకు గుమ్మడి బంగారం వంటి ఆహారం. దీన్ని ఏ రకంగా వండి తిన్నా ఇందులో పషకాలు ఎక్కడికి పోవు.

Leave a comment