మార్కెట్ లొ దొరికే మంచి మంచి బ్రాండ్స్ ను బట్టి మనం వస్తువులను ఎంచుకుంటాం. ఒక్కసారి పేరు చదివిన మన కళ్ళు …మోసపొయే వస్తువులు ఒక అక్షరం అటు ఇటుగా ఉండి మనం షాపింగ్ బ్యాగ్ లో దూరి పొతాయి. మార్కెట్ లో ఉన్న అన్ని ప్రముఖ బ్రాండ్ల డిటర్జంట్లు,చాక్ లెట్స్,ఫేస్ క్రీంలు అన్నింటికి నకిలీ బ్రాండ్ లు ఉన్నాయి. ఉదహరణకు కోల్గెట్ తీసుకొండి అచ్చం అదే ప్యాకింగ్ మధ్యలొ నీలి రంగు
అక్షరాలలో coolgate అని ఉంటుంది.colgate అనుకుని కనురెప్ప పాటులో మోసపోతాం. క్యాడ్బరీ
డైరీ మిల్క్ చాక్లేట్ అదే ప్యాకింగ్ తో   డైరీ మిల్క్ అని ఉంటుంది. రేపర్ చించి నోట్లో పెట్టుకుంటే రుచి మారిందని అది నకిలీ అని చూసే వరకు తెలియదు.
పల్లెటుళ్ళలొ ఉండే చాల మంది చదువుకున్న వాళ్ళు కాస్తా పరిశీలన ద్రుష్టి ఉన్న వాళ్ళు కనిపెడతారెమో గాని ఇక చదువుకోని వాళ్ళు అది గమనించక చెప్పేదాక వీలులెనంతగా మోసపోతారు. ఇక పల్లెటుళ్ళలొ పేరు,ప్యాకింగ్ ఒక్కటిగా ఉండే సరుకులు తేలికగా వెళ్ళిపోతాయి.వస్తువు పేరు చివరలో ఉండే ఆంగ్ల అక్షరం ఒక్కటి తప్పుగా కనిపిస్తుంది. కానీ చదువుకున్న వాళ్ళు కుడా తొందరలో గమనించకుండ తిసేసుకుంటారు. ఈ నకిలీ బ్రాండ్స్ విలువ 15 వేల కోట్లు ఉంటుందని అంచనా.
భారత్ లోను చైనా లొనో అయితే ప్రముఖ బ్రాండ్ ఉన్న షాపులు అచ్చం అలాగే ఉండే అక్షరాలు, లొగోలు అటు ఇటు గా మార్చి అదే పేర్లతో రన్ చేస్తుంటారు. పిజ్జాహాట్ ఉందనుకోండి పిజ్జాహిట్ అంటారు. లగో కలర్ షాపు రూపం అన్ని మోసమే. ఈ బ్రాండ్స్ చూసి కొనుక్కోవాలి మరి

 

Leave a comment