జంగల్ జువెల్స్ అని ఆన్ లైన్ టచ్ చేస్తే నెక్లెస్ లూ చెవి పోగులూ లాకెట్లు బ్రేస్ లెట్సు బోలెడన్ని రకాల నగలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వడ్లూ , పెద్ద తురాయి ,సర్వ జయ సపోటా వంటి 12 రకాల ధాన్యాలు గింజలతో తయారు చేసే ఈ జంగిల్ జ్యూవెలరీ టర్నోవర్ ఏడాదికి 60 లక్షలు పైనే వుంది. ట్రెండీగా ఉండే ఈ నగలు దేశ విదేశాల్లో ఎంత మందిని ఆకట్టుకుంటున్నారు. వేర్వేరు రకాల విత్తనాలు సహజమైన రంగులతో ఉండటం వల్ల రంగు కూడా త్వరగా పోరు. రకరకాల ధాన్యాలతో ఆభరణాలు తయారు చేయటం గిరిజనులకు ముందు నుంచి తెలిసిన విద్యే. ఈ నగలు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దుబాయ్ లాంటి దేశాల్లో అమ్ముడవుతాయి. చెవి పోగుల ధర 40 రూపాయల నుంచి ప్రారంభం అయితే పూసల దండలు నూటయాభై రూపాయల నుంచీ దొరుకుతాయి. ఆహార ధాన్యాలు, పండ్లు నుంచి వచ్చే విధానాలతో భిన్నమైన రూపాలతో అందంగా ఉన్నాయీ జంగిల్ జ్యూవెలరీ.
Categories