ఎంతో బాగా తయారై పోయారనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే అవే ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఎంతో చక్కని వస్త్ర ధారణ కూడా బొత్తిగా బావులేదనిపిస్తోంది. ఉదాహరణలు శరీరపు రంగుకు దగ్గరగా వుండే లేత గోధుమ రంగు డ్రెస్ వేసుకున్నారనుకోండి. చాలా నిర్లక్ష్యంగా లోదుస్తులు తెల్లనివి వేసుకుంటే అవి స్పష్టంగా బయటకు కనిపిస్తూ చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. చీర డ్రెస్ లకు లోపలవేసుకునే దుస్తులన్నీ సరైన మ్యాచింగే తీసుకోవాలి. ఒక్కసారి అమమయిలు ఆఫ్ షాల్టర్ డ్రెస్ లు ఎంచుకుంటారు. భుజాల దగ్గర బ్రా పట్టీలు కనిపించకుండా ట్యూబ్ లేదా అసలు పట్టీల్లెనీవీ వేసుకోవాలి. బరువులో కొన్నిసార్లు తేడా లొస్తూ ఉంటాయి. లోపల వేసుకుని దుస్తులు ఒక్కసారి లూజ్ గా ఒక్కసారి టైట్ గా అయిపోతాయి. అలాంటప్పుడు బ్రా ఎక్సటెండర్లు దొరుకుతాయి. సరైన రంగు ఎంచుకుని పాత వాటికీ వీటిని జత చేస్తే సరిపోయింది. బ్రా పట్టీలు భుజాలకు నొక్కుకుపోతూ ఉంటాయి. పట్టీ బెల్ట్ ఎలాస్టిక్ సాగిపోయి ఉండచ్చు. ఉతికితే ముడుచుకునీ ఉండచ్చు. ఉతికేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. వేసుకునే ముందర లోపల వేసుకునే దుస్తులన్నీ సరిగా ఉన్నాయో లేదా తప్పని సరిగా చూసుకోవాలి. ఇవన్నీ చిన్నవే సరిగా లేకపోతే మనకూ ఇబ్బందే. ఎదుటి వాళ్లకు ఆ ఇబ్బంది తెలిసిపోతూ వుంటుంది.
Categories
WhatsApp

ఇలాంటి ఇబ్బంది కొని తెచ్చుకోవటం ఎందుకు?

Leave a comment