పెళ్లిళ్లు జరిపేందుకు జాతకాలు శుభలగ్నాల కోసం చూస్తూ వుంటారు కానీ ఇద్దరి ఆలోచనలూ అభిరుచులు కలిసాయో లేదో చూడరు. సైకాలజిస్టులు ఈ విషయం, గురించి అమ్మాయిలను హెచ్చరిస్తున్నారు. కాబోయే భాగస్వామి మీకు సరైన జోడీనా కాదా అని తేల్చుకోమంటున్నారు. ముఖ్యంగా ధైర్యం పట్టిన చేయి విడువకుండా ఎలాంటి సందర్భాలనైనా ఎదుర్కోగలరా ? అలాగే అన్నింటికన్నా చాలా ముఖ్యం ఉదయం నిద్ర లేవటం వంటి మంచి అలవాట్లు ఉన్నాయా లేదా > మీ ప్రైవసీ ని గౌరవిస్తారా ? స్వీట్ మెమోరీస్ ని తలుచుకునేంత స్పందించే మనసుందా ? ఎదుటివాళ్లను గౌరవిస్తారా ? అలంటి వారు జీవిత భాగస్వామినీ గౌరవించగలరు కదా? చేసే పనిలో శ్రద్ధ వుందా ? ఉద్యోగంలో నైనా వ్యాపారం లో నైనా ఉన్నతమైన శిఖరం ఎక్కాలంటే పనిపట్ల శ్రద్ధ దీక్ష ఇష్టం వున్నాయా లేదా ఇలాంటి వన్నీ గమనించుకోమంటున్నారు. మరి కాలం తో పాటు మనస్తత్వాలు ఆలోచనలు అభిరుచులు మారిపోతున్నాయి కదా ? ఇవన్నీ బావుంటే అటు తర్వాతే జాతకాలూ ,లగ్నాలు అంటున్నారు వాళ్ళు. ప్రతి దాన్ని సైంటిఫిక్ గా ఆలోచించాలి మరి !
Categories