పిల్లలు కోరిన రుచుల్ని అందమైన బాక్స్ ల్నిఇంకెంతో అందమైన వాటర్ బాటిల్స్ సమకూర్చి వాళ్ళు కడుపునిండా మంచి కలర్ ఫుల్ లంచ్ కష్టపడి చేసి ఇస్తున్నా సరే.. ఊహు.. మాకొద్దు మాకు పేస్ట్రీలు పఫ్ లు కేకులే కావాలి. అని పంతం పట్టి కూర్చున్న పిల్లల సంఖ్యే 90 శాతంగా ఉందని డయాబెటిక్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యయనం చెపుతోంది. లంచ్ బాక్స్ లో సమతులాహారం వుందా ? శరీరానికి కావాల్సిన కొవ్వులు పోషకాలు అందుతున్నాయా లేదా అని తల్లులు ఫుడ్ కోర్సులు చేస్తున్నా పిల్లలు మాత్రం జంక్ ఫుడ్ స్టాల్ల్స్ ఉండటంతో పిల్లల లంచ్ బాక్స్ అవతల పారేసి ఈ క్యాంటిన్లకే ఎగబడిపోతున్నారు. మన దేశంలో 50శాతం మంది ఒక్కపండు గానీ ఒక్క కూర గాని తినని పిల్లలున్నారు. 40 శాతం మంది బ్రేక్ ఫాస్ట్ చేయనేచేయరు. ఇవన్నీ కూడా చిన్న వయసులోబ్ డయాబెటిస్ కు దారితీస్తున్నాయి. 25 శాతం పిల్లలు లావుగా ఆయిపోతున్నారన్నమాట. అందుకే చెన్నయ్ లోని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్ల కాంపస్ లో జంక్ ఫుడ్ సాఫ్ట్ డ్రింక్ ల అమ్మకాల పైన నిషేధం విధించారట. పిల్లలు విధిగా లంచ్ బాక్స్ లు తేవాలనీ అందులో పండ్లు కూరగాయలు ఎక్కువగా ఉండేలా టీచర్లు కూడా పర్యవేక్షించాలనీ నిషేధించి మరీ మన రాష్ట్రాలు ఎప్పుడు కళ్ళు తెరుస్తాయో ?

Leave a comment