శుభ్రత విషయంలో నూటికి నూరు మార్కులూ మనకి మనం వేసుకుంటాం. తప్పులేదు. కానీ వంటింట్లో మనకి తరచూ వాడే వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు కావాలి. పళ్ళ రసం తీస్తాం. బ్లయిండర్ లో నీళ్లు పోసి డిష్ సోప్ వేసి మళ్ళీ ఓసారి గిర్రున తిరిగేలా చేయాలి. మైక్రోవేవ్ వాసన పోవాలంటే ఒక కప్పు నీళ్లలో నిమ్మరసం ఓ అరకప్పు పోసి మైక్రో వేవ్ లో పెట్టి వేడి చేయాలి. ఆ పొగలు కక్కే నీటిని మైక్రో వేవ్ వాసనాలని దూరం చేస్తుంది. గ్లాస్ జార్ల పై కాఫీ లాంటివి పోస్తాం. బ్రౌన్ మచ్చలు పడతాయి. వాటిని పోగొట్టాలంటే ఐస్ ఉప్పు నిమ్మరసం టీయూస్కుని జార్ లో వేసి గిలకొడితే గ్లాస్ జార్ ఆ మిశ్రమం నీళ్లు తగిలి తెల్లగా తయారవుతోంది. కాఫీ కప్పుల లోపల ఎర్రని కాఫీ మరకలు ఏర్పడతాయి. ఉప్పు వెనిగర్ మిశ్రమం తో ఈ కప్పు తో తోమితే కొత్త వాటిలా అయిపోతాయి.
Categories