చిన్నతనంలో ప్రతి రోజూ పాలు తాగే పిల్లలకు వయసు ఎదిగేకొద్దీ ఆరోగ్యంగా వుంటారు. చిన్న వయసులో తాగిన పాలు తర్వాత సంవత్సరాల్లో అనేక లాభదాయకమైన ఫలితాలు ఇస్తుంటాయి. వయసు మీదపడినా వేగంగా నడవగలుగుతారు. ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోగలరు. ఫ్యాక్చర్ల అవకాశం తగ్గుతుంది. ఇవన్నీ బాగానే వుంటాయి మరి పాలు చూస్తేనే పరుగెత్తి పారిపోయే పిల్లల సంగతి ఏమిటి? పాలను ఏదైనా ఫ్లేవర్ లతో కలిపి అయినా తాగించగలగాలి. ఉదయం సాయంత్రం తాగితే చాలు. రోజుకు రెండు కప్పుల పాలు చాలంటారు డాక్టర్లు. ఆ మాత్రం పాలు పిలల్లకు కావలిసిన విటమిన్ డి ఐరన్ అందజేస్తాయి. ఈ రెండూ వారై ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఇరాన్ న్యూరాలజికల్;అభివృద్ధికి దోహదపడితే విటమిన్ డి శ్వాసకు సంబంధించిన అనారోగ్యాన్ని దగ్గరకు రానీయదు. కనుక పిలల్ల చేత ఒక రెండు కప్పుల పాలు తాగించగలిగితే చాలు. వాళ్ళ మేలుకల రక్షణకు ఎదుగుదలకు పాలు చాలా అవసరం .
Categories