నవ్వు ఎలా నవ్వినా సరే ముందు మనసు కూ ఫీల్ గుడ్ సందేశం వెళుతుందిట. సంతోషాన్నిచ్చే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. నవ్వు వల్ల అదనపు క్యాలరీలన్నీ కరిగిపోతాయి. ఇన్ఫెక్షన్ల తో పోరాడే యాంటీ బాడీస్ పెరుగుతాయి. రోగ నిరోధిక శక్తీ పెరుగుతుంది. అన్నింటికీ మించి నవ్వు చక్కని విలువైన ఆభరణం ఎన్నో లాభాలున్నాయని గ్రహించే నవ్వు యోగా కూడా ప్రారంభించారు. యోగాసనాలతో భాగమై శ్వాస క్రియ నియంత్రణ ని కలగలిపి రోగనిరోధిక వ్యవస్థను మెరుగు పరిచే విధానమే యోగా నవ్వు. దీన్ని ఇంగ్లీష్ లో లాఫ్టర్ థెరపీ అంటారనుకోండి. నవ్వు నవ్వటం ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే అదే. అలవాటవు తుందంటోంది. ఈ థెరపీ థియరీ మనసారా పది నిముషాలు నవ్వితే దాని ప్రభావం శరీరం లోని కండరాలన్నీ రిలాక్స్ అయి మనసులోని ఒత్తిడిలు పోతాయి. అంచేంత ఎలా నవ్వినా నవ్వు నవ్వే ఆ అంవ్వు ఆరోగ్యమే. కలిసి నవ్వుకుంటే మనుషుల మధ్య బంధాలు పెరుగుతాయి/ జీవితం పట్ల దృఢత్వమే మారిపోతుంది. అంచేంత హాయిగా నవ్వుకోండి.
Categories