జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ పెరగాలనుంటే అవసరమైన పోషకాలు అందించాలి. జుట్టు కుదుళ్ళ రక్తనాళాలు సన్నపడితే జుట్టు రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యానికి ఆక్సిజన్ పోషకాలు రెండూ ఇవ్వాలి. ఇవి భర్తీ చేసేందుకు మాడులో రక్త సరఫరా మెరుగ్గా జరగాలి. అంటే ఇందుకు మస్సాజ్ మంచిమందు. మస్సాజ్ వాళ్ళ జుట్టు కుదుళ్ళకు రక్త సరఫరా జరుగుతుంది . మొదట్లో కొంత జుట్టు రాలినా తర్వాత మంచి ఫలితం లభిస్తుంది. కొబ్బరి నూనె వేడి చేసి మునివేళ్లతో కుదుళ్ళ వరకు మస్సాజ్ చేయాలి. తాజా కమలా పండ్ల రసం తేనే శాండల్ ఆయిల్ కలిపి షాంపూ చేసుకున్నాక ఈ మిశ్రమంతో మళ్ళీ జుట్టు కడిగేస్తే నల్లగా నిగనిగలాడుతోంది. జుట్టు నిర్జీవంగా ఉంటే పండిన అరటికాయలో బాదం నూనె కలిపి మస్సాజ్ చేసి వాష్ చేస్తే జుట్టు జీవం తో ఉంటుంది. వేడి ఆలివ్ నూనె తీసి దాల్చిన చెక్క పొడి లవంగ పొడి కాస్త కాస్తగా కలిపి తలకు పట్టించి కడిగేసినా ఫలితం ఉంటుంది. హేయిర్ కలర్ వాడుతుంటే కండిషనర్ తో హేయిర్ ట్రీట్ చేస్తుండాలి. కలరింగ్ వల్ల జుట్టు డ్యామేజీ కాఉండా చివర్లు చిట్లకుండా సహజమైన కొబ్బరిపాలను అప్లయ్ చేసి వారంలో రెండు సార్లు తల స్నానం చేస్తూ ఉంటే జుట్టు పొడయి పోకుండా ఉంటుంది.
Categories
Soyagam

జుట్టు కుదుళ్లకు పోషకాలివ్వాలి

Leave a comment