కేరళ ఆరోగ్యమంత్రి కె కె  శైలజ ను టాప్ థింకర్ 2020 గా యూ కె ప్రతిష్టాత్మక పత్రిక ప్రాస్పెక్ట్ ఎంపిక చేసింది . కరోనా కాలంలో ఆమె చేసిన కృషి కి ఈ అరుదైన గౌరవం లభించింది . బ్రిటిష్ మ్యాగజైన్ ప్రాస్పెక్ట్ పత్రికల్లో తత్వవేత్తలు,మేధావులు,కళాకారులూ,శాస్త్రవేత్తలు ,రచయితల ను ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేసింది . పాఠకులు ,నిపుణులు,సంపాదకుల బృందం అభిప్రాయం ఆధారంగా ఈ ఎంపిక జరిగింది .  కరోనా కాలంలో రాష్ట్రంలో తగిన చర్యలు తీసుకొన్న శైలజ పేరు 50 వ స్థానంలో చేరింది . పత్రిక ప్రకారం ఈ జాబితాను ఖరారు చేయటానికి 20,000 కి పైగా ఓట్లు పోలయ్యాయి. ఈ జాబిదాలో కె కె  శైలజ మాత్రమే భారతీయ మహిళ.

Leave a comment