ఈ లాక్ డౌన్ సమయంలో ఎంత తీరికగా అనిపిస్తూ ఒత్తిడికి గురి చేస్తోంది .ఆ ఎఫెక్ట్ మొహం పైన  కనిపిస్తోందని ఎంతోమంది అమ్మాయిల ఆరోపణ.ఒత్తిడి ఎన్నో సమస్యలకు మూలం.ముందుగా ముఖ చర్మం పాడవుతుంది చర్మం నిర్జీవంగా తయారై  బ్లాక్ హెడ్స్  వస్తాయి. జుట్టు రాలిపోతుంది వీటికి  ఇంట్లో వస్తువుల తో  పోగొట్టవచ్చు.తేనె లో నిమ్మరసం కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్నచోట క్రమంతప్పకుండా రాస్తే కొద్ది రోజుల్లోనే తేడా తెలుస్తుంది.వెంట్రుకలు నిర్జీవంగా మారిపోతే ఆలివ్ నూనెలో  తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందర  జుట్టుకు ,చివర్ల వరకు రాసుకుని పడుకోని తెల్లవారి తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది చివర్లు  చిట్లిపోకుండా ఉంటాయి.

Leave a comment