నీహారికా ,

ఈ లోకం లో  ప్రమాదకరమైన దేదీ అని అడిగావు కదా అది జెలసీ . అసూయ అడవిలో పుట్టే కార్చిచ్చు తో సమానం. ఇది బాధ పడేవారిని బాధకు కారణమైన వారినీ సమానంగా దహిస్తుంది. ఈ లోకం లో ఆనందం లేకపోవటనికి ఎన్నో కారణాలు. కోరికలు అంచనాలు అవసరాలు బులపాటం  అసంతృప్తి అత్యాశ అన్నింటికంటే ప్రధానం ప్రమాదం అసూయ. అసూయాపరులకు  రెండే చింతలు తనకులేదని ఇతరులకు ఉందనీ. మానసిక శాస్త్ర పరంగా చుస్తే ఈ అసూయకు పాజిటివ్ గా వాడుకుంటే స్ఫూర్తి అభివృద్ధి సాధించవచ్చు. ఈర్ష్య తో దేన్నయినా  సాధించాలన్నా పట్టుదల పెంచుకోవచ్చు. కానీ మనుషులకు దృష్టిలోపం. మనకున్న బలహీనతలను ఇతరులకు బలాల తో పోల్చుకుంటాం. మనల్ని బాధ పెట్టె బాధలు ఎన్నో ఉంటాయి. అందుకే పోల్చుకోకూడదు. అప్పుడు మన కున్న సంపదను  గుర్తించలేదని గుడ్డివాళ్లం అవుతాము. అనుబంధాలు ఏర్పరుచుకోలేకపోతాము. ఎంత నష్టపోతామో చూడు. ఎప్పుడైతే మనం దృఢమైన చిరకాలం నిలిచే అనుబంధాలు నమ్మటం పరస్పర గౌరవం స్నేహాలు నిలుపుకుంటామో అప్పుడిక ఈ నిర్దయమైన కార్చిచ్చు మన దగ్గరకు రాకుండా పోతుంది. ఏమంటావు ??

 

Leave a comment