ఈ ప్రపంచంలో అతి క్లిష్టమైన అతి ముఖ్యమైన పనేమిటంటే ఒక యువతి, తల్లి అయ్యాక పిల్లల జీవితాన్ని సరైన క్రమంలో నడిపిస్తూ పెంచడం. ఇలా ఒక పర్ఫెక్ట్ మదర్ కు వుండ వలసిన లక్షణాల గురించి ఎలాంటి పరెంటింగ్ క్లాసులు, లెక్చర్లు, పుస్తకాలు ఖచ్చితమైన సూత్రాలు, సందేహాలకు సమాధానాలు వుండవు. పిల్లలు ఎవరికి వారే యూనిక్. ఒకలాగా ఎవ్వల్లు ఉండరు. అమ్మలే తమ పిల్లల తత్వాలు, అవసరాలు సందర్భాలను బట్టి స్వంత నిర్ణయాలు సముచితంగా, సమయానుకూలంగా తీసుకోవాలి. తమ పిల్లల గురించి అందరికంటే అనుభవంలో తెలుసుకోగలిగేది అమ్మలే తప్పుల అభ్యాసమనే పరెంటింగ్ లో అతి ముఖ్యం. ఇది బాగా పని చేస్తుందో అంచనా వేసుకుని ఏది కాదో సరి చేసుకోని పిల్లల విషయంలో వీలును అవసరాన్ని బట్టి మార్పులు చేసుకుంటుంది తల్లి. పరెంటింగ్ ఒక జాబ్ లాంటిది. జస్ట్ హాపెన్స్ అని బుజాలని ఎగరేసేందుకు కుదరదు. ప్రతి నిమిషం ఒక నిరంతర ప్రవాహం లాగా అమ్మా తన ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చి పిల్లల విషయంలో సెక్సెస్ పొందాలి. మంచి అమ్మను అన్న టాగ్ ను తనకు తనే తగిలించుకోవాలి.

Leave a comment