గ్రీన్ టీ తో చర్మ, శిరోజాల సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.మొటిమలు, మచ్చల సమస్యలు ఉంటే టీ బ్యాగ్ ని వేడి నీళ్లలో వేసి ఆ నీటిని చల్లార్చి ఆ నీళ్లతో ముఖాన్ని క్లీన్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది నీళ్లతో కడిగాక ముఖం పడుచు కోకుండా ముఖం పై ఆరి పోనివ్వాలి.షాంపూ తర్వాత హెయిర్ కండీషనర్ గా గ్రీన్ టీ నీళ్లను వాడుకోవాలి. ఇది శిరోజాల కుదుళ్ళకు మంచి స్టిమ్యులేటర్ గా పనిచేస్తుంది. జుట్టుకు పోషకాలు ఇస్తుంది జుట్టు సిల్క్ లాగా మెరుపుతో ఉండాలంటే గ్రీన్ టీ ఆకుల లో పెరుగు గుడ్డు వేసి బాగా కలిపి కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు మాస్క్ వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో వాష్ చేస్తే జుట్టు ఎంతో మెత్తగా మెరుపుతో ఉంటుంది.

Leave a comment