74 వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లాస్ ఏంజెల్స్ లో వేడుకగా జరిగాయి. ఆ వేదిక పైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంగారు వర్గపు గౌనుతో ఎంతో అందంగా మెరిసిపోయింది. గోల్డెన్ గ్లోబ్స్ 2017 అవార్డుల ఫంక్షన్ కు టీవీ కేటగిరీ లో అవార్డులు అందజేసేందుకు గానూ ప్రియాంకను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎమ్మా స్టోన్ నటాలీ ఫోర్ట్ మన్ వంటి స్టార్స్ తో సమానంగా ఈమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించింది. డి వాకింగ్ రెడ్ స్టార్ చిత్రంలో నటించిన జెఫ్రీ డీన్ మోర్గాన్ తో కలిసి బెస్ట్ టీవీ యాక్టర్ గా ఎంపికైన బిల్లీ జాజ్ థార్న టన్ కు అవార్డు అందజేసింది. హెడ్ లైన్ స్టార్ ఆఫ్ అమెరికన్ నెట్ వర్క్ షో క్వాంటికో హోరీ లో ప్రియాంక ఈ అరుదైన గౌరవం పొందింది. గత సంవత్సరం ఆస్కార్ ఎమ్మీ అవార్డుల ప్రధానం కోసం ఆహ్వానం అందుకున్న ప్రియాంక తాజాగా ఇంటెర్నేషనల్ అవార్డుకు హాజరవటం ఇది మూడోసారి. గోల్డెన్ గ్లోబ్ లో ఇది మొదటిసారి. ఈమె నటించిన బే వాచ్ హాలీవుడ్ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. .
Categories