ఎంతో ఇష్టంగా కొనుకున్న దుస్తుల పైన మరకలు పడితే కష్టంగా ఉంటుంది. ఒక్కసారి చిన్న మరకకే అందమైన డ్రెస్ వేసుకోవాలనిపించదు. ఇప్పుడు వాటిని వదిలించే మార్గాలుకోనున్నాయి. దుస్తుల పైన గ్రీజు మరకలు పడితే సూడ నీళ్లలో నాన్ననిచ్చి  ఉతికితే మరకలు మాయం అవుతాయి. అదే నూనె మరకైతే దానిపైన పౌడర్ చల్లటమో సుద్ద ముక్కతో రుద్దటమో చేయాలి. ఆరిన తర్వాత గోరు వెచ్చని నీళ్లతో నానబెట్టి ఉతికితే నూనె మరకలుండవు. అలాగే కాఫీ తాగాక మరక పడితే ఆమరకలను బేకింగ్ షోడా వేసిన నీళ్లలో నానబెట్టి ఉతకాలి. చెమట మరకలకు  నిమ్మరసం మంచిగా పనిచేస్తుంది.లేదా నిమ్మచెక్కను చెమట వాసన వచ్చే సాక్స్ పైన లేదా దుస్తుల పైన రుద్ది కాసేపాగి ఉతికేస్తే పోతాయి. ఇంకో  మరకలు పాలతో రుద్దితే పోతాయి. మేకప్ చేసుకుంటునప్పుడు ఫౌండేషన్ లు ఒలకటం పౌడర్లు పడటం వల్ల ఏర్పడిన మారకాలని షేవింగ్ క్రీం తో రుద్దేస్తే పోతాయి. రక్తం మరకలు పడితే హైడ్రోజన్ పెరాక్సిడ్  వేసి రుద్దితే పోతాయి.

Leave a comment