చీరకంటే అందమైన వస్త్ర ధారణ ఇంకొటిలేదు. చీరలో వయసు కనబడుతుందనుకుంటారు కానీ చీరకట్టులో కిటుకులు తెలిసి ఉంటే చీర అన్నిటికంటే బెస్ట్ డ్రెస్ అనిపిస్తుంది. అందంగా కనిపించాలంటే ముందుగా శరీరాకృతికి తగిన చీర ఎంచుకోగలగాలి. కొన్ని రకాల ప్రింట్లు కొన్ని డిజైన్లు శరీరాకృతిని ఒక్క తీరులో చూపెడతాయి. షిఫాన్ జార్జెట్ క్రేప్ చీరలైతే తక్కువ బరువు ఉంది వంటికి అతుక్కుపోయి నాజూకుగా కనపడేలా చేస్తాయి. చాలా పెద్దగా ఎక్కువ వెడల్పు అంచుల చీరల వల్ల ఎత్తు తక్కువగా కనిపిస్తాయి అంచేత అసలు అంచులు లేనివాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. చీరలో ఎలా కనిపించాలన్నది మన ఎంపికే. కొంగు కిందవరకూ జారాడేలా వేసుకోవాలి. ఇది నడుము భాగాన్ని దాచేస్తూ అందంగా ఉండేలా చేస్తుంది. సన్నని ప్రింట్లు కూడా నాజూకుగానే కనిపిస్తాయి. లేత రంగు చీరలు శరీర వర్ణానికి తగిపోయే చీరలు ఎంచుకుంటే సన్నగా కనిపిస్తారు. అలాగే చీర ఎప్పుడూ సన్నగా మడతలు లేకుండా శుభ్రంగా ఇస్త్రీ చేసి నీట్ గా ఉండాలి. అప్పుడే హెసెరా ఖరీదు తో నిమ్మితం లేకుండా మనిషికి హుందాతనాన్ని ఇస్తుంది. ఎలాంటి చీర అయినా. అలాగే వెళ్లే సందర్భాన్ని బట్టి కూడా చీరలు ఎంచుకుంటే బావుంటుంది .

Leave a comment