CRAWLING ఇప్పుడో గొప్ప ఫిట్ నెస్ ఎక్సర్ సైజు . ప్రొఫెషనల్ అథ్లెట్స్ కూడా ఇప్పుడు దీన్ని ఫాలో అవుతున్నారు. ఇది భారీ వ్యాయామం కానే కాదు . అదే చిన్నపిల్లలు నేల పైన పాకటం ప్రాక్టీస్ చేయటం దెస విదేశాల్లో ఇప్పుడీ వ్యాయామానికి ఎంతో క్రేజ్ ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామం అయినా సరదాగా ఆడుతూ పాడుతూ చేయాలన్నది ఇప్పుడో కొత్త నియమం. శరీరంలో నడుము పైన ఉన్న భాగాలకు నడుము కింద ఉన్న భాగాలకు మధ్య సమన్వయం లోపిస్తే సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. పాకటం ద్వారా ఈ సమస్య పోతుంది . దీనివల్ల వెన్నుముక్క కు స్థిరత్వం సమన్వయం చురుకుదనం తో పాటు ఎన్నో ప్రయోజనాలున్నాయి . ఈ క్రాలింగ్ తో శారీరిక మానసిక దృఢత్వం వస్తుంది. శరీరంలో ప్రతి కదలిక కేంద్రీయ నాడీ వ్యవస్థ తో ముడిపడి ఉంటుంది. బిగుసుకుపోన కీళ్ల కండరాలు సాగేలా చేస్తుంది. పాకటం వల్ల జాయింట్ పెయిన్ పోతాయి. శరీరంలో కీలక కండరాలు భుజాలు తొడలు మోకాళ్ళు కీళ్ళు ఈ వ్యాయామం బలోపేతం చేస్తుందని నిపుణులు చెపుతున్నారు. ఇందులో బియర్ట్ క్రాల్ క్రీచ క్రాల్ స్పైడర్ మాన్ క్రాల్ ఆర్మ్ క్రాల్ ఇన్ వామ్ క్రాల్ ఎన్నో రకాలున్నాయి.
Categories