పోడవాటి కురులు అందంగా ఉంటాయి. జాడలు ముడులు వేసుకునే సౌకర్యం ఉంటుంది కానీ చిట్టిపొట్టి కట్స్ తోనే ఇవాళ్టి అమ్మాయిలు ఫ్యాషన్ గా వుంటామంటున్నారు. ఎన్నో రకాలతో ఎప్పుడు కూడా బాచ్ కట్ క్లాసిక్ ట్రెండ్ గా ఉంటుంది. ముందువైపుకు కొంచెం జాలువారుతూ షార్ప్ గా షార్ట్ గా వుండే బాచ్ ఇప్పటి ట్రెండ్. పిక్సీ కట్ యువతులకు ఫ్యాషన్ స్టేట్ మెంట్. అలాగే లేయర్ కట్ తో పొడుగ్గా వున్నా పోటీగా వున్నా శిరోజాలకు వ్యాల్యుమ్ ను సహజ టెక్చర్ ను ఇవ్వటానికి లేయర్లు పర్ ఫెక్ట్ గా ఉంటాయి. లేయర్డ్ బాచ్ లేదా పిక్సీ ప్రయత్నం ఉంటాయి. ఇక పేజ్ బాయ్ స్టయిల్ అయితే సరదాగా సోఫెస్టికేటెడ్ గా వుండే స్టయిల్. ర్యాంప్ లతో ఎక్కువగా కనిపించే స్టయిల్ ఇది. ఇలాంటి కట్స్ తో హేయిర్ స్ప్రే బ్లో డ్రయర్ వాడటం వల్ల శిరోజాలు వెనీ గా ఉంటాయి. అలాల్లాంటి జుట్టుకు యాక్ససరీస్ తో అదనపు అందం వస్తుంది. జ్యుయల్డ్ హేయిర్ క్లిప్స్ ఫెథర్స్ ఫ్లవర్స్ ఎక్సట్రా బాబీ పిన్స్ హేయిర్ ట్విస్టింగ్ కు జోడింపుగా ఉంటాయి. సాయంత్రాల్లో ప్రత్యేక సందర్భాల కోసం ఎక్కువ సేపు వుండే హేయిర్ స్ప్రే వాడితే మరింత పాలిష్డ్ వేవీ రూపం వస్తుంది. అలాగే రంగుల ప్రయోగాలు బావుంటాయి.
Categories