అలారం పెట్టుకుని నిద్రలోంచి మెలకువ తెచ్చుకుంటూ వుంటాం . శరీరాన్ని నియంత్రించగలం అనుకొంటున్నాం గానీ నిద్ర ఎంతవరకు అవసరమో అంతపొగలిగితేనే మేలు అంటున్నాయి అధ్యయనాలు. ఎంత సేపు నిద్ర పోగలిగితే పూర్తీ చురుకుదనం తో ఉత్సాహం తో ఉండగలమో మన అనుభవంతోనే తేల్చుకోవాలంటున్నారు. మన జీవ గడియారం స్థితి ప్రకారం నిద్రపోవటం మేల్కోవటం చేయాలి. ఒక్కసారి ఎక్కువసేపు నిద్ర మేల్కొనవలసి ఉంటుంది.అలంటి వృత్తిలో రాత్రివేళ కొంతసేపు నిద్రమేలుకుని పనిచేయవలిసి వస్తే తెల్లారి నిద్రను మన అదుపులోకి తీసుకుని లేచిపోకూడదు అంటునాన్రు రిపోర్ట్ లు. నిద్ర ఎంత అవసరం కంటే మనం నిద్రపోతున్నప్పుడే మెదడు ఎండోక్రైన్ గ్రంధిని రోగ నిరోధిక వ్యవస్థను హార్మోన్ల కార్యకలాపాలను నియంత్రిస్తుంది. నిద్రలో మన జ్ఞాపకాలను సరైన రీతిలో పదిలపరుస్తుంది. నిద్ర ఎక్కువసేపు పోతే బరువు పెరుగుతాం అనుకోవటం చాలా తప్పు ఒక గంట ఎక్కువసేపు నిద్రపోతే వారానికి అరకిలో చప్పున బరువు తగ్గచ్చు. పైగా స్త్రీలకు నెలసరి మందు గర్భిణీగా ఉన్నప్పుడు మెనోపాజ్ సమీపిస్తున్నపుడు నిద్ర ఎక్కువగా చాలా అవసరం.
Categories