చాలా మందికి చాలా సార్లు వృత్తీ ప్రవృత్తీ ఒకటే అయిపోతుంది. అసలు అదే సిసలైన జీవన విధానం కూడా ఫ్యాషన్ మేరీకోమ్ చిత్రాల్లో ఆత్మవిశ్వాసంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించగలనని ప్రియాంక చోప్రా తన పాత్రల ద్వారా చూపించింది. అలా సాహసం తో నిలబడటం మహిళలకు కీలకం అని పాత్రల్లో చెప్పిన ప్రియాంక నిజ జీవితంలో మహిళా సాధికారత గురించి బోధిస్తోంది. మగవాళ్ల కంటే ఆడవాళ్ళూ ఏ విషయంలో తక్కువ కానే కాదు. ఈ ప్రపంచంలో మనకెంతో విలువుంది. అన్న ప్రసంగాలతో అందరిలోనూ స్ఫూర్తి నిలుపుతోంది. ఒక టెలివిజన్ షో కోసం బోస్టన్ వెళ్లిన ప్రియాంక విద్యతో మహిళల అభివృద్ధి అన్న కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించింది. ఈ వేదికపైన ఆమె చేసిన ప్రసంగం అందరి ప్రశంసలు అందుకుంది . అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ బ్రిటన్ మాజీ ప్రధాని జోర్డాన్ బ్రౌన్ వంటి వారితో ఆ వేదిక పంచుకున్న ప్రియాంక గొప్ప వ్యక్తుల సరసన నచ్చిన ప్రసంగం చేయగలిగినందుకు ఎంతో సంతోషపడింది. ఆమె ఇప్పుడు అన్నింటా విజేతే. అంతర్జాతీయ స్థాయి నటిగా హాలీవుడ్ లో ఆమె నటించిన చిత్రంలో తనకంటూ ఓ ప్రత్యేకత కూడా తెచ్చుకుంది. ప్రియాంక చోప్రా.