కడుపులో ఇన్ఫెక్షన్ లు రావటానికి చేతుల్లోని క్రీములే ఎక్కువ భాగం మనం ఎన్నో సబ్బుల యాడ్స్ లో చూస్తుంటాం. కానీ ఇటీవలే పరిశోధనల్లో ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్స్ జెల్స్ వాడటం వల్ల ఉదర సంబంధిత మైన ఇన్ఫెక్షన్స్ విస్తరించకుండా తగ్గించవచ్చునని తేలింది. డే కేర్ సెంటర్ల లోని వందల మంది పిలల్లపై విస్తృత మైన అధ్యయనాలు నిర్వహించారు, ఆ డే కేర్ సెంటర్స్ లోని బాత్ రూమ్ కిచెన్ పిల్లల గదుల్లో జెల్స్ వాడారు. ఐదు నెలల తర్వాత జరిగిన పరీక్షల్లో ఈ జెల్ వాడిన ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ లు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే పరిశుభ్రత ఎక్కువగా పాటించే కుటుంబాల పిల్లలో కూడా ఉదర సంబంధమైన అనారోగ్యాలు తక్కువ అని అధ్యయనాల్లో తేలింది. ఆల్కహాల్ ఆధారిత జెల్స్ చర్మం పై గల బాక్టీరియా ఇతర వైరస్ లను బాగా నశింపజేస్తాయని నిపుణులు తెలిపారు. జెల్స్ లో 60 శాతం ఆల్కహాల్ ఉండాలని వాళ్ళు సూచించారు. సాదా సబ్బులు నీటితో చేతులు కడుక్కోవటం కంటే ఈ జెల్స్ వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Categories